24 March, 2026 | 5:25 PM

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ప్రధాని కీలక ప్రకటన

24-03-2026 03:53 PM

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో ప్రకటించారు. గల్ఫ్ దేశాల్లో సుమారు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని, భారతీయుల జీవనోపాధికి రక్షణ కల్పించడం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హర్మూజ్ జలసంధిలో అనేక నౌకలు చిక్కుకున్నాయని, నిలిచిపోయిన నౌకల్లో భారతీయ సిబ్బంది చాలామంది చిక్కుకున్నారని ఆయన తెలిపారు.

క్లీష్ట సమయంలో అంతా ఒక్కటై చర్చించడం అత్యావశ్యకం, ఎంత క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం ఉంటుందన్నారు. సమస్యకు చక్కని పరిష్కారమే కీలక అంశమని, భారతీయుల భద్రతే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవడంతో 375000 మంది స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారని మోదీ వెల్లడించారు. భారత్ కు వచ్చే నౌకల మార్గం సుగమానికి అన్ని చర్యలు అని, ఇప్పటికే హర్మూజ్ జలసంధి నుంచి కొన్ని నౌకలు దాటివచ్చాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.