14 July, 2026 | 10:02 PM

ప్రజలతో మంత్రి శ్రీధర్ బాబు ముఖాముఖి

23-10-2024 05:09 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గాంధీభవన్ లో బుధవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీసు అభ్యర్థులు తమ ఇబ్బందులను, జీవో నంబర్ 46 వల్ల కలిగే సమస్యలను మంత్రి శ్రీధర్ బాబుకు వివరించారు. పోలీసు అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో భేటీ ఏర్పాటు చేయిస్తానని, మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. వికలాంగులు వీఆర్ఏ, డీఎస్సీ అభ్యర్థులు, తదితర సంఘాల ప్రతినిధులు మంత్రి శ్రీధర్ బాబుకు విజ్ఞప్తులు అందజేశారు.