25 May, 2026 | 1:09 PM

సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

25-05-2026 12:33 PM

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలోని సీతారామా ప్రాజెక్టు పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పరిశీలించారు. మంత్రి తుమ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ సీతారామ ప్రాజెక్టులో భాగమైన యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించారు. గోదావరి పరివాహకం ఖమ్మం జిల్లాలోనే ఎక్కువగా ఉందని తెలిపారు. పరివాహక ప్రాంతం జిల్లాలోనే ఎక్కువగా ఉన్నా.. వినియోగం తక్కువన్నారు. సీతారామ ప్రాజెక్టులో(Sitarama Project Works) 3 పంపుహౌస్ ల నిర్మాణం పూర్తి అయ్యాయని తెలిపారు. యాతాలకుంట టన్నెల్(Yathalakunta Tunnel) ద్వారా సత్తుపల్లికి గోదావరి జలాలు వస్తాయన్నారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు, సీతారామ ప్రాజెక్టు ద్వారా మొత్తం 10 లక్షల పైగా ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.