7 August, 2026 | 7:59 PM

అర్హులైన వికలాంగ, వితంతు, గీత కార్మికులు దరఖాస్తు చేసుకోండి

07-08-2026 07:13 PM

– ఎంపీడీఓ రవీంద్రా రెడ్డి 

దమ్మపేట,(విజయక్రాంతి): వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు పింఛను దరఖాస్తులు పంచాయతీ కార్యదర్శి ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ ఒక ప్రకటనలో తెలిపారు. వితంతువు పింఛను కొరకు 18 సంవత్సరాలు నిండి, భర్త మరణ ధృవీకరణ, 150000ల ఆదాయం ధృవపత్రం సమర్పించాలి.

ఒంటరి మహిళ పింఛను కొరకు 18 సంవత్సరములు నిండి, విడాకుల పత్రం లేదా మండల రెవిన్యూ అధికారి ధృవీకరణ, రూ.150000 ల లోపు ఆదాయం, వికలాంగుల పింఛను కొరకు వయసుతో సంబంధం లేదని, 40శాతం డిసేబిలిటీ, చెవిటి 50శాతం కలిగి ఉన్న వారు అర్హులని తెలిపారు. గీత కార్మికులు 50 సంవత్సరములు కలిగి, గీత కార్మిక సొసైటీ సర్టిఫికెట్ ఉండాలన్నారు. నేత కార్మికులు 50 సంవత్సరములు, హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ సర్టిఫికెట్ ఉండాలని, అందరు పింఛన్ దరఖాస్తుదారులకు ఆదాయం రూ.150000 రూపాయలులోపు వుండాలి.

భూమి 3 ఎకరాలు తరి, మెరక 7.5 ఎకరాలు మించకుండా వుండాలని తెలిపారు. దరఖాస్తుల కొరకు పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. దరఖాస్తులను మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ద్వారా ఆన్లైన్ చేయబడుతుందని, ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత అర్హులకు పింఛన్లు మంజూరు చేయబడతాయని, వృధాప్య పెన్షన్ ల కొరకు తేదీ తరువాత తెలుపబడుతుందని ఎంపీడీఓ బి. రవీంద్రా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.