9 June, 2026 | 1:14 AM

కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో మంత్రి వాకిటి శ్రీహరి పూజలు

09-06-2026 12:05 AM

ఎల్బీనగర్, జూన్ 8: తెలంగాణ పశుసంవర్థక, యువజన, క్రీడా శాఖల మంత్రి వాకిటి శ్రీహరి మంత్రి పదవి స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా పురస్కరించుకొని సతీ సమేతంగా సోమవారం కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయ ఈవో లావణ్య, అర్చకులు, సిబ్బంది మంత్రికి సాంప్రదాయబద్దంగా పూర్ణ కుంభముతో స్వాగతము పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ వేద పండితులు, అర్చకులు మంత్రికి  ఆశీర్వదించి, స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.