9 June, 2026 | 1:22 AM

అవగాహన ఉండాలి ప్రధానోపాధ్యాయులు రాములు

09-06-2026 12:05 AM

అడ్డాకుల జూన్  8 : సరైన అవగాహనతోనే పనులు చేయాలని  అడ్డాకుల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు అన్నారు. సోమవారం ఉపాధి హామీ కూలీలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రం లోని గోపన్నకుంట కాలువ పనుల వద్ద పనిచేస్తున్న కూలీలను కలిసి ప్రభుత్వ పాఠశా లల్లో అందిస్తున్న నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడ్డాకుల ప్రాథమిక పాఠశాలలో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. చిన్నారులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించడంతో పాటు ఆటలు, పాటలు, కథల ద్వారా ప్లే-వే విధానంలో బోధన నిర్వహిస్తున్నామని చెప్పారు.