31-08-2025 06:50:08 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని మొగిలిపాక గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీకి చెందిన మైనారిటీ సోదరులు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.