21 April, 2026 | 4:46 PM

Breaking News

ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

జిల్లాలో 305.09 కోట్ల రైతు భరోసా

24-06-2025 10:34 PM

విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్...

అశ్వరావుపేట (విజయక్రాంతి): రైతు భరోసా-విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా మంగళవారం అశ్వారావుపేట రైతు వేదికలో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అశ్వారావుపేట నియోయకవర్గ శాసన సభ్యులు జారే ఆదినారాయణ(MLA Jare Adinarayana), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్(District Collector Jitesh V Patil), ట్రైనీ కలెక్టర్ సౌరబ్, జిల్లా వ్యవసాయ అధికారి వి. బాబూరావు. అశ్వారావుపేట రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో ఇప్పటి వరకు 1,76,236 మంది రైతులకు రూ 305.09 కోట్లు, అశ్వారావుపేట నియోజకవర్గ రైతులకు 45,058 రైతులకు రూ 81.39 కోట్లు జమ చేయటం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులతో కలెక్టర్  రైతులతో బయోచార్ తయారీ, అజోల్లా పెంపకం, మునగ సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కిషోర్, జిల్లా ఉద్యాన అధికారి, సుజాత మున్సిపల్ కమిషనర్ అశ్వారావుపేట, పి. రవికుమార్ - సహాయ వ్యవసాయ సంచాలకులు అశ్వారావుపేట డివిజన్ రామకృష్ణ, తహసీల్దార్ బి. సాయి నారాయణ, టెక్నికల్ వ్యవసాయ అధికారి పి. శివ రామ ప్రసాద్ - మండల వ్యవసాయ అధికారి సతీష్, రవీంద్ర రావు, వ్యవసాయ విస్తారణ అధికారులు, ఎలక్రికల్, శ్రీ సత్యనారాయణ - చైర్మన్ పాక్స్ అశ్వారావుపేట శ్రీ జూపల్లి రమేష్, శ్రీ తుమ్మ రాంబాబు శ్రీ సుంకవల్లి వీరభద్రరావు, శ్రీ మొగళ్ళపు వెంకట చెన్న కేశవరావు, మహిళా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.