ఎస్టీ కమ్యూనిటీ హల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

13-09-2026 | 03:56pm

గుడిహత్నూర్, (విజయక్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని శాంతపూర్(Shanthapur) గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎస్టీ కమ్యూనిటీ హల్ ను ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఐక్యతతో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఏ అవసరం ఉన్న అన్నా అని పలకరిస్తే అండగా ఉంటానన్నారు.

కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో చిన్న చిన్న గోండు గూడలను గ్రామ పంచాయతీలుగా మార్చి ‘మావ నాటే మావ రాజ్’ నినాదాన్ని నిజం చేశారన్నారు. ఆదివాసులు అభివృద్ధి చెందాలని, వారు అడగకముందే అండగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు