2 March, 2026 | 10:31 PM

యువత క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి

02-03-2026 07:33 PM

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

C,(విజయక్రాంతి): మండల కేంద్రంలో కోవ లక్ష్మి ఫౌండేషన్, డైలీ క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... క్రీడలు యువతలో క్రమశిక్షణను, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో యువత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్‌లు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

అనంతరం ఎమ్మెల్యే బ్యాటింగ్ చేసి ఆటను ప్రారంభించి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండి అహ్మద్, వాంకిడి సర్పంచ్ సతీష్, బీఆర్ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి, గాదె ప్రవీణ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ జబరి పేంటు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అజయ్ కుమార్, జబరి రవీందర్, పోటు శ్రీధర్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు.