calender_icon.png 21 February, 2026 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

20-02-2026 09:46:12 PM

పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే ప్రభుత్వ ధ్యేయం

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఏర్వ మమత గణేష్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం  మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని, గత  ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. నకిరేకల్ నియోజకవర్గంకు తొలి విడతగా 3,500 ఇండ్లు కేటాయించినట్లు వెల్లడించారు.

ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కలను సాకారం చేస్తామని స్పష్టం చేశారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మండల ప్రజాప్రతినిదులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.