ఎమ్మెల్యే స్పీడ్‌తో.. అభివృద్ధి జోరు!

01-10-2026 | 05:56pm

నాగల్‌గిద్ద, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కారముంగి, ఔదత్‌పూర్, ఇరక్‌పల్లి గ్రామాల్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.కారముంగిలో రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు(CC Road), మరో రూ.10 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ఔదత్‌పూర్‌లో ఖదీర్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఇరక్‌పల్లి ప్రాథమిక పాఠశాలలో అపెక్స్ ఆసుపత్రి యజమాని డాక్టర్ సునీల్ కుమార్ మలిగే సమకూర్చిన స్టీల్ వాటర్ బాటిళ్లను 200 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

కార్యక్రమాల్లో ఆత్మ కమిటీ అధ్యక్షుడు వినోద్ పాటిల్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు విఠల్‌రావు పాటిల్, సర్పంచులు రవికుమార్ పాటిల్, అంబాజీ సంతోష్, అనిల్ పాటిల్, మల్గే శివశరణప్ప, హాటిసింగ్, రవి, బస్వరాజ్, గుండెరావు పాటిల్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సచిన్ పాటిల్, కరస్‌గుత్తి ఉపసర్పంచ్ అంబ్రేష్ గడ్డే, మనోహర్ పాటిల్, నారాయణ జాదవ్, సురేష్ జాదవ్, రమేష్ చౌహాన్, సంజీవ్, అబ్దుల్ రహీం, చందు పాటిల్, ఎంఈఓ మన్మధ కిషోర్, రవీందర్‌రావు, బస్వరాజ్ హల్లె తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు