13 March, 2026 | 5:05 AM

మానేరుపై హై లెవెల్ వంతెన.. తీరనున్న ఓదెల మండల ప్రజల కష్టాలు

18-06-2025 02:41 PM

హై లెవెల్ వంతెన కు శంకుస్థాపన లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

పెద్దపల్లి:(విజయక్రాంతి): మానేరుపై హై లెవెల్ వంతెన నిర్మాణంతో ఓదెల మండల ప్రజల కష్టాలు తెరనున్నాయని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గంలోని ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామంలో మానేరు వాగుపై రూ. 80 కోట్లతో నిర్మించనున్న నూతన హై లెవెల్ వంతెనకు ఎమ్మెల్యే విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఓదెల మండల ప్రజల చిరకాల కోరిక ఈ వంతెన నిర్మాణం తో త్వరలోనే తిరనున్నాట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.