12 March, 2026 | 10:09 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

నడిరోడ్డుపై పాడైన లారీ.. రెండ్రోజులుగా రాక పోకులకు అంతరాయం

18-06-2025 02:45 PM

ఖానాపూర్,(విజయక్రాంతి):  నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ ప్రధాన రహదారి లారీ అడ్డపై బారి లోడుతో వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ డౌన్ కావడంతో  నడిరోడ్డుపై నిలిచిపోగా రెండు రోజులుగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. మంగళవారం సాయంత్రం సిమెంట్ లోడుతో మెట్పల్లి నుంచి నిర్మల్ వెళ్తున్న లారీ లో సమస్యతో నిలిచిపోయింది. దానిని తొలగించలేక యజమాని నానా అవస్థలు పడుతుండగా, రెండు రోజులు లారీ నడిరోడ్డుపై నిలిచిపోయింది. దీంతో రాకపోకలు ఒకే వైపు నుంచి కొనసాగించాల్సి వస్తుంది.

జగిత్యాల నిర్మల్ జిల్లాలకు ప్రధాన రహదారి అయిన ఈ మార్గం ఖానాపూర్ పట్టణం ప్రధాన కూడలి, ప్రతిరోజు వందల సంఖ్యలో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదివరకే రోడ్డు మార్గం వెడల్పు చేయకపోగా ఇరుకు మార్గం గుండా ఈ రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దానికి తోడు అదే ఇరుకు మార్గంలో భారీ లారీ పాడై నిలిచిపోవడంతో పట్టణవాసుల ప్రయాణికుల తిప్పలు అన్ని ఇన్ని కావు. ఇకనైనా అధికారులు స్పందించి లారీని పక్కకు జరిపించే ప్రయత్నం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.