నల్గొండ స్థానంలో అత్యధిక మెజారిటీతో గెలువబోతున్నాం
ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ ను గెలిపించండి: ఈటల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యువత.. ప్రధాని నరేంద్ర మోడీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని భారతీయ జనతా పార్టీ మాజీ ఏమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పట్టభద్రలు కూడా మోడీ వైపే చూస్తున్నారని ఈటల పేర్కొన్నారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ ను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని ఈటల విమర్శించారు. సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. నల్గొండ ఎంపీ స్థానంలో అత్యధిక మెజారిటీతో గెలువబోతున్నామని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజీపీకి 12 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపారు.