24 May, 2026 | 3:34 PM

Breaking News

అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •  

500 కోట్ల నుంచి 3,000 కోట్లకు..

31-10-2024 02:42 AM

ఐదేళ్లలో ౬ రెట్లు పెరిగిన ఎమ్మెల్యే ఆస్తులు

ముంబై, అక్టోబర్ 30: మరో 3 వారాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 288 స్థానాలకు 8,000  మంది అభ్యర్థులు నామి నేషన్ దాఖలు చేశారు. వీరిలో ఘట్‌కోపర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి పరాగ్ షా అత్యం త సంపన్నుడిగా నిలిచారు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తి రూ.3,383 కోట్లు. గత ఐదేళ్లతో పోలిస్తే ఆయన ఆస్తి 575 శాతం పెరిగింది. 2019 ఎన్నికల సమయంలో పరాగ్ ఆస్తులు రూ. 556 కోట్లు మాత్రమే. ఈ అంశంపై ప్రత్యర్థులు విమర్శలు చేస్తుండటంతో పరాగ్ స్పందించారు. అందరికీ సంప ద ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం తెలియాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను నిజాయితీని నమ్ముకున్న వ్యక్తిని. నేను నాయకుడిని మాత్రమే కాదు. వ్యాపారవేత్త కూడా. అంతేకాకుండా నా సంపాదనలో 50 శాతం సామాజిక సేవకే ఉపయోగిస్తా అని వెల్లడించారు.