calender_icon.png 20 January, 2026 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐజీ హాస్పిటల్‌కు ఎమ్మెల్సీ కవిత

02-10-2024 02:38:47 AM

శేరిలింగంపల్లి, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గైనిక్ సంబంధిత అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ఆమె సాయంత్రం వరకు అక్కడే ఉండి వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకున్నట్లు తెలిసింది.

లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి కొన్నాళ్లు తీహార్ జైలులో ఉన్న సమయంలోనే ఆమె అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. బెయిల్‌పై విడుదల య్యాక ఆమె మళ్లీ గైనిక్ సమస్యలతో సతమమవుతూ తాజాగా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.