మోడీ పాలన ఓ సువర్ణ అధ్యాయం
- మోడీ 12 ఏళ్ల అభివృద్ధి పాలన పూర్తి
- ఆలయంలో బిజెపి నాయకుల పూజలు
చేవెళ్ల జూన్ 10(విజయక్రాంతి): 12 సంవత్సరాల సేవ అభివృద్ధి విశ్వాసందేశ సేవలో విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం భారతదేశం మరింత ఉన్న త శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ బీజేపీ పార్టీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దేశానికి పిఎం చేస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇలాగే నిరంతరం కొనసాగాలని భగవంతుడిని ప్రార్థించాము. ప్రధాని నరేంద్ర మోడీ 4,399 రోజులు ‘12 సంవత్సరాల సేవ... అభివృద్ధి... విశ్వాసం‘ తో కూడిన పాలన పూర్తనా యాల ఓ సువర్ణ అ ధ్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థాని క నాయకులు, కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.
12 సంవత్సరాల ప్రజాసేవ పూర్తి చే సుకున్న సందర్భంగా, దేశాభివృద్ధి మరింత ముందుకు సాగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వైభవరెడ్డి, కౌన్సిలర్ దయాకర్, మనీషా, మాణిక్య రెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ శర్వలింగం, జిల్లా కార్యదర్శి కృష్ణ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.






