29 March, 2026 | 9:01 AM

మరింత ఎగిసిన బంగారం

22-11-2024 12:00 AM

నాలుగు రోజుల్లో రూ.2,300 పెరిగిన పసిడి

హైదరాబాద్, నవంబర్ 21: ప్రపంచ ట్రెండ్‌ను అనుసరిస్తూ దేశంలో బంగారం ధర వరుసగా నాలుగో రోజూ పెరిగింది.  హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గురువా రం 24 క్యారెట్ల తులం బంగారం ధర  మరో రూ.330 పెరిగి రూ.77,950 వద్ద నిలిచిం ది.  సోమవారం రూ.660, మంగళవారం రూ. 760, బుధవారం రూ.550 చొప్పున ధర పెరిగింది. వరుస నాలుగు రోజుల్లో ఇది రూ.2,300 ఎగిసింది.

  22 క్యారెట్ల ఆభర ణాల బంగారం 10 గ్రాముల ధర మరో రూ.300 పెరిగి రూ.71,450 వద్ద నిలిచింది. అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో  బంగారం ధర భారీగా క్షీణించి తులం ధర  రూ.5,000కు పైగా పడిపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య తాజా ఉద్రిక్త తలు, అమెరికా దన్నుతో  ఉక్రెయిన్ తమ దేశంలో దాడులు జరిపితే ప్రపంచ యుద్ధం వస్తుందంటూ రష్యా హెచ్చరిక చేసిన కారణంగా  అంతర్జాతీయ మార్కెట్లో బంగా రం హఠాత్తుగా పెరిగింది.