11 April, 2026 | 3:45 AM

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య కేసు.. భర్తతో సహా పదిమంది అరెస్ట్

11-04-2026 01:40 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య కేసు దర్యాప్తులో పోలీసులు భర్తతో పాటు పది మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా మ రో ఇద్దరు పరారీలో ఉన్నారు.  ఐనవోలు మండలం పున్నెలులో ఈనెల 1న భార్య, ఇద్దరు కూతుళ్లను భర్త స్విమ్మింగ్ పూల్‌లో నెట్టేసి చంపేసిన ఘటన కలకలం రేపింది. భార్యకు ఆడపిల్లలే పుడుతున్నారని భర్త అజారుద్దీన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

సంఘటనకు సంబంధించి వివరాలను నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.కొడుకే పుట్టాలన్న కోరికతో నిం దితుడు అజారుద్దీన్.. భార్య, ఇద్దరు కూతుళ్లను చంపేశాడని సీపీ తెలిపారు. అప్పటికే భార్యకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి రెండు అబార్షన్లు చేయించాడని.. మరోసారి ఫరహాత్ గర్భం దాల్చడంతో ఆమెకు మళ్లీ ఆడపిల్లే పుడుతుందన్న భ యంతో చంపేసినట్లు వివరించారు.

ఓ బా లికను వివాహం చేసుకోవాలని అనుకున్నాడని.. పథకం ప్రకారమే భార్య, పిల్లలను తన స్విమ్మింగ్ పూల్‌కి తీసుకెళ్లి నీళ్లలో ముంచి చంపేసినట్లు చెప్పారు.  వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ దర్యాప్తు చేపట్టగా, సంఘటనకు ప్రధాన బాధ్యులైన ఫర్హాత్ భర్త అజారుద్దీన్, అతనికి సహకరించిన పున్నెలుకు చెందిన కుటుంబ సభ్యులు ఎండీ చాంద్ పాషా, సలీహా, షర్ఫుద్దీన్, అలాగే బసిక స్రవంతి (కడిపికొండ) , బాల్నే పార్ధు (నెక్కొండ), బొమ్మెర మనోహర్ (గీసుకొండ), లింగాల నరేష్ (కొండ పర్తి), సట్ల రాజు (పున్నెలు), వాంకుడోత్ బద్రు (ఏనుగల్లు)ను అరెస్టు చేయగా ఈ  డాక్టర్లు బాల్నే పూర్ణిమ, ఎస్. రవళి పరారీలో ఉన్నారు