11 April, 2026 | 10:53 PM

కోదాడ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. 16 మందికి గాయాలు

11-04-2026 09:13 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణ పరిధిలోని బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి ఏలూరు వైపు వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, వేగంగా వెళ్తూ ముందుగా వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొట్టిన ప్రభావంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు కలిసి వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం, అలాగే అధిక వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.