15 April, 2026 | 1:26 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్

15-04-2026 12:09 PM

మహిళలకు వాటా పెంపును సీఎం రేవంత్ వ్యతిరేకిస్తున్నారా?

రేవంత్ రెడ్డి ప్రతిపాదన చూసి ప్రజలు నవ్వుతున్నారు.

 మహిళలు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?

న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజనపై(Delimitationబీజేపీ ఎంపీ లక్ష్మణ్(MP Laxman) ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మహిళలకు వాటా పెంపును సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యతిరేకిస్తున్నారా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగ వ్యతిరేక ప్రతిపాదనను రేవంత్ రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి ప్రతిపాదనను చూసి ప్రజలు నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష? అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే అడ్డుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం సలహాతోనే జీహెచ్ఎంసీలో వార్డులు(GHMC Wards) పెంచారని ఆరోపించారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, Delimitationపై పోరాటం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.