పేద యువతి వివాహానికి చేయూత
20-08-2026 03:16 PM
కోనరావుపేట, ఆగస్టు 20: కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రజక కుటుంబ యువతి నేరెళ్ల జమున వివాహానికి ధర్మారం ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు చేయూత అందించారు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించడంతో పేదరికంలో ఉన్న జమునకు పెళ్లి కానుకగా డ్రెస్సింగ్ టేబుల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు, ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యూత్ రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ అధ్యక్షుడు సురేష్, ధర్మారం గ్రామ అధ్యక్షుడు పడిగె విజయ్, వెంకటేష్, అభిషేక్, రమణ, మహేష్, ప్రశాంత్‌తో పాటు రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.






