విద్యుత్ ప్లాంటను గ్రిడ్ కు అనుసంధానం
గ్రీన్ ఎనర్జీకి సౌర విద్యుత్ ప్లాంట్ లు కీలకం
ఎస్ఈ బేతి బిక్షపతి
ములుగు,(విజయక్రాంతి): సౌర విద్యుత్ ప్లాంట్ గ్రిడ్(Solar Power Plant Grid)కు అనుసంధానం పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ములుగు జిల్లాలో మరో ముందడుగు పడింది. ములుగు సర్కిల్, ములుగు డివిజన్(Mulugu Division) పరిధిలోని మల్లంపల్లి సెక్షన్, రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన బొక్క సునీల్ రెడ్డి, అపర్ణ, పెంటా రెడ్డి ఏర్పాటు చేసిన 2+2 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ విద్యుత్ గ్రిడ్‌కు గురువారం అనుసంధానం చేశామని సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ బేతి బిక్షపతి(Circle Superintending Engineer Bethi Bikshapathi) తెలిపారు.
ఈ సందర్బంగా ఎస్ఈ మాట్లాడుతూ సౌర విద్యుత్ ప్లాంట్ల గ్రిడ్ అనుసంధానం ద్వారా పర్యావరణహితమైన విద్యుత్ ఉత్పత్తికి మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెంపొందుతుంది. గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను బలోపేతం చేయడంలో ఇటువంటి సౌర విద్యుత్ ప్రాజెక్టులు కీలకంగా నిలుస్తాయని తెలిపారు. ఈ రెండు ప్లాంట్లను విజయవంతంగా గ్రిడ్‌కు అనుసంధానం చేయడంలో సమన్వయంతో కృషి చేసిన ఆపరేషన్, ప్రొటెక్షన్ విభాగాల అధికారులు, సిబ్బందిని, అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ములుగు, డీఈ రాజు , ఎంఆర్‌టీ అండ్ కన్‌స్ట్రక్షన్, భూపాలపల్లి, ఆపరేషన్, ప్రొటెక్షన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.