16 April, 2026 | 3:53 AM

ముంబై గెలుపు బాట పట్టేనా?

16-04-2026 02:15 AM

పంజాబ్ కింగ్స్‌తో కీలక పోరు

రోహిత్‌శర్మ ఆడడం డౌటే

తీవ్ర ఒత్తిడిలో ముంబై జట్టు

ముంబై, ఏప్రిల్ 15 : ఐపీఎల్ 19వ సీజన్‌లో వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై ఇండియన్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. హోంగ్రౌండ్ వాంఖడే స్టేడియం వేదికగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ సీజన్‌ను అద్భుత విజయం తో ఆరంభించిన ముంబై తర్వాత చతికిలపడింది.

హ్యాట్రిక్ పరాజయాలతో తీవ్ర ఒత్తి డిలో ఉంది. బ్యాటింగ్‌లో కీలక ఆటగాళ్లెవ్వరూ రాణించకపోవడం, బౌలర్లు తేలిపో తుండడంతో వరుస ఓటములు ఎదుర్కొంటోంది. ఓపెనర్ల నుంచి ఫినిషర్ల వరకూ అనుకున్న స్థాయిలో ఎవ్వరూ ఆడడం లేదు. రోహిత్, రికెల్టన్‌లలో ఎవరో ఒకరే కాసేపు క్రీజులో ఉంటుండగా.. పవర్ ప్లేలోనే ఔట్ అవుతున్నారు. గత మ్యాచ్‌లో రోహిత్ గా యంతో తప్పుకోవడం ముంబై విజయావకాశాలను దెబ్బతీసింది. అలాగే సూర్యకు మార్ యాదవ్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్‌లోనూ తనదైన ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు.

తిలక్ వర్మ, నమన్ ధీర్ వైఫల్యం కూడా ముంబైకి ఇబ్బందిగా మారింది. గత కొన్ని సీజన్లుగా అత్యంత నిలకడగా రాణిస్తున్న తిలక్ వర్మ ఈ సారి ఎందుకో తన ఫామ్ కొనసాగించలేకపోతున్నాడు. హార్థిక్ పాండ్యా, రూథర్ ఫర్డ్ చివర్లో మెరుపులు మెరిపిస్తున్నా మిగిలిన బ్యాటర్ల నుంచి సపోర్ట్ ఉండడం లేదు. ముంబై బ్యాటింగ్ పూర్తిగా గాడిన పడితే తప్ప గెలుపు బాట పట్టే పరిస్థితి లేదు. అటు బౌలింగ్‌లో స్టార్ పేసర్ బుమ్రా అస్సలు ప్రభావం చూపించలేకపోతున్నాడు.

ఇప్పటి వరకూ ఒక్క వికెట్ కూడా తీయలేదంటే బుమ్రా బౌలింగ్ ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు యార్కర్లు, పదునైన స్వింగ్‌తో బ్యాట ర్లను భయపెట్టిన బుమ్రా ఇప్పుడు వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా కూడా ఫలితం ఉండడం లేదు. బౌల్ట్ , శార్థూల్ ఠా కూర్ కూడా పెద్దగా ప్రభావం చూపడం లేదు.  మిఛెల్ శాంట్నర్ కూడా నిరాశపరుస్తుండడం ముంబై ఓటములకు ఒక కారణం గా చెప్పొచ్చు.  మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటి వర కూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.

మూ డు మ్యాచ్‌లు గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం తో రద్దవగా పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సూపర్ ఫామ్‌తో అదరగొడుతున్నాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ లతో జట్టును గెలిపిస్తున్నాడు. అలాగే ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య కూడా దుమ్మురేపుతున్నా రు. వీరితో పాటు కూపర్ కన్నోలీ, శశాంక్ సింగ్, నేహల్ వధేరా, స్టోయినిస్ లాంటి టీ20 స్పెషలిస్టులు కూడా ఉన్నారు. అటు బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్ విఫలమవుతుండగా.. బార్ట్ లెట్, యెన్సన్‌తో పాటు విజ య్ కుమార్ వైశాక్ రాణిస్తున్నారు. 

గత రికార్డులు 

34 మ్యాచ్‌లలో తలపడితే చెరొక 17 సార్లు గెలిచాయి. 

పిచ్ రిపోర్ట్

మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చే వాంఖడేలో బ్యా టర్ల హవానే కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీస్కోర్లు నమోదవడం ఖాయమని చెప్పొచ్చు.

తుది జట్లు అంచనా

ముంబై ఇండియన్స్ : డికాక్, రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, నమన్‌ధీర్, శాంట్నర్, శార్థూల్ ఠాకూర్ మయాంక్ మార్కండే, బుమ్రా

పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రన్, కూపర్, శ్రేయాస్ (కెప్టెన్), శశాంక్ , నేహల్ వధేరా, స్టోయినిస్, యెన్సన్, బార్ట్‌లెట్, విజయ్‌కుమార్ వైశాఖ్, అర్షదీప్ సింగ్, చాహల్