16 April, 2026 | 3:52 AM

రహానేకు జరిమానా

16-04-2026 02:10 AM

ముంబై , ఏప్రిల్ 15: ఐపీఎల్ 19వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కష్టాలు ఇప్పట్లో ముగిసేలా లేవు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క విజయాన్నీ అందుకోలేదు. ఆడిన 5 మ్యా చ్‌లలో నాలుగింట ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో పాయింట్ లభించింది. అటు పలువురు కీలక ఆటగాళ్లు గాయాలపాలై టోర్నీ నుంచి ఇప్పటికే తప్పుకొన్నారు. 

వరుస ఓటములతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ జట్టుకు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రహానేపై జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సకాలంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా రహానేకు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో కేకేఆర్ మళ్లీ స్లో ఓవర్ రేట్‌కు పాల్పడితే కెప్టెన్‌తో పాటు జట్టులోని ఆటగాళ్లందరికీ భారీ జరిమానాలు తప్పవు.

అప్పుడు కెప్టెన్ రహానేకు రూ.24 లక్షల జరిమానా, ఆటగాళ్లందరికీ మ్యాచ్ ఫీజు లో 25 శాతం కోత లేదా ఆరు లక్షల చొప్పున జరిమానా విధిస్తారు. మూడోసారి కూ డా అదే తప్పు రిపీటయితే మా త్రం కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవని కోల్‌కతా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా శ్రేయాస్ అయ్యర్కి రెండుసార్లు జరిమానా పడితే, రిషభ్ పంత్కి ఒకసారి ఫైన్ విధించారు. కాగా చెన్నైపై బ్యాటర్లు విఫలం కావడంతో మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కామెరూన్ గ్రీన్ ఫ్లాప్ షో, రింకూ సింగ్ తనదైన స్టయిల్లో బ్యాటింగ్ చేయకపోవడం కేకేఆర్ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.