ఆరోపణలు నిరూపించు.. లేదా క్షమాపణ చెప్పు..
మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి
బెల్లంపల్లి, (విజయక్రాంతి): బీఆర్ఎస్ 6వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ సల్ల కృష్ణవేణి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేనిపక్షంలో బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలని మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి(Municipal Chairperson Dava Swathi) డిమాండ్ చేశారు. ఆదివారం మునిసిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీలో చేరాలని తన భర్త రమేష్ కృష్ణవేణిను వేధింపులకు పాల్పడినట్టు చేసిన ఆరోపణలు పూర్తిగా సత్యదూరమని ఖండించారు. కాంగ్రెస్లో ఆమె చేయడంలో కాంగ్రెస్ ఒరిగేదేమీ లేదన్నారు. ఆమెను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకునే అఘాయిత్యం తమకు లేదని స్పష్టం చేశారు. అబద్ధపు ఆరోపణలతో తన భర్త పరువుకు భంగం కలిగించాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. తన భర్త పై చేసిన ఆరోపణల రుజువు కోసం 24 గంటలు సమయం ఇస్తున్నానీ తెలిపారు.
ఈ గడువులోపు చేసిన ఆరోపణలు సాక్షాదారాలతో నిరూపణకు రావాలానీ సవాల్ చేశారు. రుజువు చేయకపోతే పరువు నష్టం దావా వేస్తానని పేర్కొన్నారు. సల్ల కృష్ణవేణి సోదరి ఆర్పిగా పనిచేస్తూనే బ్యాంకులో కూడా పనిచేస్తున్నాదని తెలిపారు. ఇలా పనిచేయడం నిబంధనలకు విరుద్ధమని మెప్మా అధికారులు ఆమెకు నోటిసులు ఇచ్చారని తెలిపారు. ఆ నోటీసులకు తమకేమీ సంబంధం లేదని తెలిపారు..కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై తప్పుడు ఆరోపణలు చేయడం మనకొక పోతే తీవ్రంగా స్పందిoచాల్సి వస్తుందని తెలిపారు. తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో తమ పార్టీ పై బురద చల్లాలనిచూస్తే గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. అభివృద్ధి ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.
అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీ ఆర్ఎస్ కౌన్సిలర్లు నిజం తెలుసుకోకుండా చెప్పుడు మాటలు విని కృష్ణవేణి కి మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని చైర్ పర్సన్ దావస్వాతి హితవు పలికారు. ఆమె చేసిన ఆరోపణలు మద్దతు ఇచ్చిన బీ ఆర్ ఎస్ నాయకులైనా నిరూపించాలని కోరారు. ఆరోపణలు రూడీ చేస్తే దేనికైనా రెడీ అని ఆమె సవాలు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దావా రమేశ్, కౌన్సిలర్లు నిజాముద్దీన్, కంకటి ప్రణీత, డి కొండ పద్మ, జంగం కల్పన, చింతల వసంత, దామెర విజయ, నీలి హారిక, వంశీకృష్ణ, రామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు డీకొండ రాయలింగు, శంకర్ సింగ్, కంకటి శ్రీనివాసు, పి శ్రీనివాసు, దామెర శ్రీనివాస్, గౌస్ బాబా పాల్గొన్నారు.