17-02-2026 09:07:08 PM
మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పట్టణ అభివృద్దే లక్ష్యంగా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి సహకారంతో అభివృద్ధి చేస్తానని ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా ఎండీ అహ్మద్ కి మంగళవారం పట్టణంలోని సందీప్ నగర్ (ఎస్సీ కాలనీలో) కాలనీవాసులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో పట్టణంలోని సమస్యలు పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టౌన్ అధ్యక్షుడు అహ్మద్ బిన్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ నిసార్, బీజేపి ఎస్సీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరీ జయరాజ్, బీసీ సంఘం నాయకులు కోట వెంకన్న, కాలనీవాసులు సయ్యద్ అజార్, మాటూరి కుమార్, చిలుముల నితిన్, అఖిల్, మోతే జాన్, సిహెచ్ కిరణ్, ఏం ఆదిత్య , ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.