ఉమ్మడి తాండూరు జిపి పరిధిలో గల పెద్దమ్మతల్లి వారోత్సవాలు
నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): మండలంలోని తాండూరు ఉమ్మడి జిపి పరిధిలో గల తాండూర్, కిచన్నపేట్ అక్కంపల్లి, ఇందిరానగర్ గ్రామాల పరిధిలో గల పెద్దమ్మతల్లి వారోత్సవం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.గ్రామాలలో గల అన్ని గ్రామ దేవతలకు గ్రామస్తులు,భక్తులు భక్తుశ్రద్ధలతో నియమ నిబంధనలతో బోనాలు నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా ఆలయం వద్దకు తరలివెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా మూడు గ్రామాల ప్రజలు,భక్తులు వర్షాలు బాగా పడి రైతన్నలు సమృద్ధిగా పంటలు పండించాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని,పెద్దమ్మ తల్లి దీవెనలు గ్రామ దేవతల దీవెనలు ప్రజల అందరిపై ఉండాలని వేడుకున్నారు. తలపై బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా బోనాల జాతర జన జాతరగా వాతావరణం నెలకొంది.చిన్నలు పెద్దలు అందరు కలిసికట్టుగా కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా జరుపుకున్నారు.






