17-02-2026 09:02:28 PM
* ఉద్యమ కెరటం ఎగిసి... పరిపాలనలో మేటుగా నిలిచి
* ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు
గరిడేపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ అస్తిత్వ శిఖరం స్వరాష్ట్రసాధకుడు ఉద్యమ కెరటమై ఎగిసి పరిపాలనలో మేటుగా నిలిచిన గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 72వ జన్మదిన వేడుకలు మండల కేంద్రంతో పాటు మండలంలోని కీతవారిగూడెం, పోనుగోడు పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు.
కీతవారిగూడెంలో గ్రామ సర్పంచ్ బొల్లేపల్లి రామనాథం గౌడ్, పొనుగోడు లో మాజీ ఎంపీటీసీ మేళ్లచెరువు వెంకటరమణ మరియు పార్టీ నాయకులతో కలిసి మొక్కలు నాటి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజల దీవెనలతో కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు.
అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా తెలంగాణను చాటి చెప్పిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కడేనని ఆయన తెలంగాణ చేసిన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, వీరం రెడ్డి శంబి రెడ్డి, కడియం స్వప్న, మా శెట్టి శ్రీహరి, బోధ సైదిరెడ్డి, కుసుమ శ్రీనివాస్ రెడ్డి, పెండెం శోభ ధనయ్య గౌడ్, పోలంపల్లి ఆనంద్ బాబు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు