9 May, 2026 | 2:15 PM

Breaking News

అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి   •   తమిళనాడులో రాజకీయ సంక్షోభం.. హైదరాబాద్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు   •   నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •  

ముస్లింలు, క్రిస్టియన్లు కాదు.. బీజేపీనే మమ్మల్ని వ్యతిరేకించింది

12-10-2024 01:38 AM

జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి

చెన్నై, అక్టోబర్ 11: గోధ్వజ్ యాత్ర ప్రారంభించినప్పుడు ముస్లింలు, క్రిస్టియన్లు వ్యతిరేకిస్తారని భావించామని, అందుకు వారి గ్రంథాలు చదివి పూర్తి సిద్ధమయ్యామని జ్మోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ సరస్వతి అన్నారు. కానీ, అనూహ్యంగా బీజేపీ మమ్మల్ని వ్యతిరేకించిందని ఆరోపించారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం గోధ్వజ్ స్థాపన చేసిన అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామీజీ మాట్లాడారు. గోధ్వజ్ యాత్రను అధికార బీజేపీనే వ్యతిరేకించడం తమను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. గోధ్వజ్ స్థాపన భారత్ యాత్రలో భాగంగా శనివారం పాండిచేర్చికి శంకరాచార్య స్వామీజీ వెళ్లనున్నారు.