19 August, 2026 | 2:25 PM

ప్రిన్సిపల్ రూపారెడ్డిని చంపింది..! టెన్త్ క్లాస్ విద్యార్థులే!

19-08-2026 12:49 PM

హైదరాబాద్: నల్లొండ జిల్లా ప్రిన్సిపల్ రూపారెడ్డి(Principal Rupa Reddy) హత్య కేసు కీలక మలుపు తిరిగింది. రూపారెడ్డికి చెందిన స్కూల్ విద్యార్థులే నిందితులుగా గుర్తించారు. పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డిని హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. డబ్బుల కోసమే ఇద్దరు పదో తరగతి విద్యార్థులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు విధ్యార్థులు మాస్క్, హుడీ ధరించి ఈ నెల 11న రూపారెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఒక విద్యార్థి ఇంట్లోకి వెళ్లి డబ్బులు ఇవ్వాలని బెదిరించగా రూపారెడ్డి ప్రతిఘటించారు. మాస్క్ ఊడిపోవడంతో విద్యార్థిని గుర్తించి ప్రిన్సిపల్ రూపారెడ్డి కేకలు పెట్టారు.

గుర్తింపు బయటపడటంతో రూపారెడ్డిని వెంట తీసుకెళ్లిన విద్యార్థి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమె శరీరంపై 27 కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో నుంచి రూ.2.20 లక్షలు తీసుకున్న నిందితుడు బయట ఉన్న విద్యార్థికి రూ.  40 వేలు ఇచ్చాడు. ఇద్దరు విద్యార్థులు దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు గుర్తించారు. అనుమానం రావడంతో పోలీసులు పదో తరగతి విద్యార్థిని విచారించారు. విచారణ సమయంలో విద్యార్థి జేబులో రూ. 1.60 లక్షల నగదు గుర్తించారు. నగదుకు రక్తపు మరకలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. రక్తపు మరకలపై ప్రశ్నించడంతో విద్యార్థులు నిజం ఒప్పుకున్నారని పోలీసులు వెల్లడించారు.