నూతన గృహప్రవేశం లబ్ధిదారులకు వస్త్రాలు అందజేసిన నాయకులు
కామారెడ్డి ఆగస్టు 19, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో బుధవారం నలుగురు నాగారపు రమ్య రాజు, నిమ్మ అర్చన రమేష్, నర్రాగుల మానేవ్వ శేఖర్, కొడిప్యాక నిరంజన్ గౌడ్, ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు నూతన గృహప్రవేశం సందర్భంగా వారికి నూతన వస్త్రాలను మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ సర్పంచ్ ఐరెని నరసయ్యతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చాలని ఆలోచనతో పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మించడం జరుగుతుందన్నారు.
దోమకొండలో 161 మందికి ఇండ్లు మంజూరయ్యాయని అందులో 80 మంది గృహప్రవేశం చేసినట్లు తెలిపారు. ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం గుర్తించి వారికి ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రి సీతక్కలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కదిరి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాములు నర్సింలు బాలరాజు, సుధాకర్, సిద్ధ రాములు, నయీమ్, సంతోష్, రాజయ్య, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






