‘ప్యారడైజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్.. ఎక్కడంటే?
20-09-2026 | 03:20pm
హైదరాబాద్: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్(Pre-release) ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. రేపు హైదరాబాద్(Hyderabad)లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ‘జడల్ జమానా తన అడ్డాకు చేరుకొంది’ అంటూ క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో సినిమా విడుదలపై నాని అభిమానుల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.