రికార్డుల పరిశీలన.. సేవలపై ఆరా

28-09-2026 | 04:42pm

- రికార్డుల పరిశీలన.. వైద్య సేవలు, సిబ్బంది పనితీరుపై సమీక్ష

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): మండలంలోని కరస్‌గుత్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ నర్సింగ్ చౌహాన్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది విధుల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్వహిస్తున్న విధులు, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఒక్కొక్కరిని వివరాలు అడిగారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని నర్సింగ్ చౌహాన్ సూచించారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఈ తనిఖీలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జువేరియా బేగం, ఎంఎల్‌హెచ్‌పీలు పూజా పాటిల్, రాజశేఖర్ రెడ్డి, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు