16 March, 2026 | 10:27 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

నేడు న్యాస్ సర్వే

04-12-2024 01:57 AM

హాజరుకానున్న లక్ష మంది విద్యార్థులు

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే (న్యాస్) దేశవ్యాప్తంగా ఈ నెల 4న జరగనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని 3, 6, 9వ తరగతి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరిశీలించేందుకు ఈ సర్వేను నిర్వహించనున్నారు. మన రాష్ట్రం నుంచి దాదాపు 3,340 పాఠశాలల్లోని లక్ష మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి విద్యార్థులను అధికారులు సన్నద్ధం చేశారు. ప్రతీ మూడేళ్లకోసారి న్యాస్‌ను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది.

గతంలో 2021లో న్యాస్ నిర్వహించగా, ఈసారి పర్ఫామెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్ రాష్ట్రీయ సర్వేక్షన్ (పరాస్) పేరుతో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. లాంగ్వెజ్‌లు, సోషల్ స్టడీస్, గణితం ఇతర సబ్జెక్టులపై విద్యార్థుల సామర్థ్యాలను ఈ సర్వేద్వారా అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకును ప్రకటిస్తారు.