రాజీ పడడమే ఉత్తమం: జూనియర్ సివిల్ జడ్జి రవి
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ లోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం జూనియర్ సివిల్ జడ్జి పర్వతం రవి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్, బ్యాంకు, క్రిమినల్, సివిల్ కు సంబంధించిన పలు కేసులను పరిష్కరించారు. ఇరు పక్షాలు పరస్పర అంగీకారంతో రాజీకి రావడంతో పలు కేసులు పరిష్కారమయ్యాయని జడ్జి రవి తెలిపారు. కోర్టుల చుట్టు తిరుగుతు ఉండడం కంటే మీ అంతట మీరే రాజీ పడడం ఎంతో ఉత్తమమైనదన్నారు. జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి అన్ని శాఖలు సహకరించి కృషి చేయాలని జడ్జి సూచించారు. లోక్ అదాలత్ ద్వారా ఇరు పక్షాలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు