టీబీ రహిత భారత్ కోసం అవగాహన
28-09-2026 | 08:08pm
ముకరంపుర,(విజయ క్రాంతి): స్థానిక రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల(Rajarajeshwara Government Arts and Science College) ఎన్సిసి యూనిట్ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నైన్ తెలంగాణ బెటాలియన్ సంయుక్త ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్మూలనకై అవగాహన సదస్సు లో డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ ఎన్సిసి క్యాడెట్లు అవగాహన పెంచుకొని సమాజంలో సాధారణ ప్రజలకు అవగాహన కల్పించుటలో ప్రధాన పాత్ర పోషించాలని, భారత్ నుండి రాబోవు రెండు సంవత్సరాలలో టీబీ విముక్త భారత్ గా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో ఏవో లెఫ్ట్నెంట్ కల్నల్ వి కృష్ణ, ఎన్సిసి అధికారి కెప్టెన్ రేల్ల సంజీవ్, మూర్తి ఉపన్యాసకు సిబ్బంది జిల్లాలోని వివిధ కళాశాలల ఎన్సిసి కేడెట్ లు పాల్గొన్నారు.