రోహిత్‌తో నీనా గుప్తా ఫన్
ముంబై: క్రికెటర్ రోహిత్ శర్మ హోస్ట్‌గా సాగుతున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’(Family Full House With Rohit Sharma)లో నటి నీనా గుప్తా(Actress Neena Gupta) తన స్పాంటేనియస్ కామెంట్‌తో అందరినీ నవ్వించారు. పొరుగువారిని చూసి అసూయ కలిగించే అంశం ఏంటని రోహిత్ అడగ్గా.. నీనా గుప్తా వెంటనే “అతని అందమైన భార్యను చూసి” అంటూ సరదాగా బదులిచ్చారు. ఆమె సమాధానంతో రోహిత్ సహా షోలోని వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. ‘చుంబక్’ ఓటీటీ షో తారాగణం పాల్గొన్న ఈ ఎపిసోడ్‌లో ఆటలు, సరదా సంభాషణలు సందడి చేశాయి.
మరోవైపు రోహిత్ శర్మ వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో చేసిన ఐకానిక్ సెలబ్రేషన్ డాన్స్‌ను నటీనటులు కలిసి రీక్రియేట్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక రోహిత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా షోలో పంచుకున్నారు. బిజీ షెడ్యూల్ తర్వాత రిలాక్స్ కావడానికి తన పిల్లలతో సమయం గడపడమే తనకు ఇష్టమని చెప్పారు. పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారో చూడటం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని రోహిత్ పేర్కొన్నారు.