షబ్బీర్ అలీని కలిసిన కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షులు
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి నియోజకవర్గంలో నూతనంగా నియమితులైన భిక్కనూర్, దోమకొండ, బిబిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తూ పార్టీ కార్యకలాపాలను విస్తరించాలని షబ్బీర్ అలీ సూచించారు.
అలాగే మండల కమిటీలను పునర్వ్యవస్థీకరించి, యువజన కాంగ్రెస్ కమిటీలను గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని, ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, నూతన మండల అధ్యక్షులు పాత రాజు(బిబిపెట్), ఆశబోయిన శ్రీనివాస్(దోమకొండ), నరేందర్ రెడ్డి(భిక్కనూర్), నోషిలాల్, మాజీ మండల అధ్యక్షులు అనంత్ రెడ్డి, సుతారి రమేష్, కౌన్సిలర్ మోతిలాల్, మాజీ జడ్పీటీసీ తీర్మాల్ గౌడ్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఇంద్రాసేన రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






