బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్
02-05-2026 09:09 PM
ఆమనగల్లు,(విజయక్రాంతి): ఆమనగల్లు కోర్టులో జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ గా అరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన కాటం స్వరూప బదిలీ కావడంతో ఆమె స్థానంలో తెలంగాణలో జూనియర్ సివిల్ జడ్జిగా సేవలందిస్తున్న ఆయన గతంలో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఐవీ అసిస్టెంట్ జడ్జిగా, జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పోలీసు అధికారులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, న్యాయవాదులు పాల్గొన్నారు.






