4 May, 2026 | 6:48 AM

వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు

12-03-2026 05:55 PM

మఠంపల్లి మార్చి 12(విజయ క్రాంతి): మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామంలో సాగర్ సిమెంట్స్ వారు గతంలో ఏర్పాటు చేసిన  మినరల్ వాటర్ ప్లాంట్ లోని మిషనరీ పాతవి అవడం వలన గ్రామ సర్పంచ్ అమరారపు వెంకటేశ్వర్లు పాలకవర్గ సభ్యుల అభ్యర్థన మేరకు పాత పరికరాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ ప్లాంట్ ను సాగర్ సిమెంట్స్ ప్రతినిధి తుడి వెంకటరెడ్డి,గ్రామ సర్పంచితో కలిసి పునఃప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అడగగానే సహాయం చేసిన సాగర్ సిమెంట్ యాజమాన్యానికి ధన్యావాదాలు,ఈ సహకారం పెదవీడు గ్రామానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రవీణ్,గ్రామ ఉప సర్పంచ్ మల్ రెడ్డి త్రివేణి కోటిరెడ్డి,పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.