ఏప్రిల్‌లో కొత్త సినిమా
ఏప్రిల్ నుంచి మళ్లీ సినిమాలు చేయడం ఆరంభిస్తున్నట్టు నిర్మాత బెల్లంకొండ సురేశ్ వెల్లడించారు. గత తొమ్మిదేళ్లుగా వార్తల్లో లేనప్పటికీ తాను సినీ వాతావరణం లోనే ఉన్నానని చెప్పుకొచ్చారాయన. ఫిల్మ్ ఇండస్ట్రీలో తన ప్రయాణం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రొడ్యూసర్ సురేశ్ బుధవారం మీడియాతో సమావేశ మయ్యారు. ‘తొలుత నా కుమారుడితోనే సినిమా చేస్తాను. మా పెద్దబ్బాయి శ్రీనివాస్ కెరీర్ సెట్ అయిపోయింది. చిన్నబ్బాయి గణేశ్ ఇప్పుడే సెట్ చేసుకుంటున్నాడు’ అని తెలిపారు.
త్వరలో నా కొడుకు పెళ్లి..
ఇండస్ట్రీలో వరుస వివాహ వార్తలు సంద డి రేపుతున్నాయి. నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయా న్ని బెల్లంకొండ సురేశ్ స్వయంగా ప్రకటించారు. తన చిన్న కుమారుడు గణేశ్ పెళ్లికి కాస్త సమయం ఉందని.. శ్రీనివాస్ వివాహం త్వరలోనే ఉంటుందన్నారు. శ్రీనివాస్‌ది పెద్దలు కుదిర్చిన వివాహమేనన్నారు. ఇండస్ట్రీతో సంబంధం లేని అమ్మా యినే పెళ్లి చేసుకోబోతున్నారని సురేశ్ తెలిపారు.






