16 July, 2026 | 12:52 PM

సోయా పంట తెగులు రైతన్న దిగులు

16-07-2026 12:50 PM

బోథ్,(విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులతో రైతులు సతమతమగుతుంటే పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకుతుండడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మొలకెత్తిన పంటను కాపాడుకునేందుకు రైతులు వర్షం కోసం ఎదురు చూస్తుంటే పంటలను తెగుళ్ల బాధ వెంటాడుతుందని వాపోతున్నారు. సరియైన వర్షాలు కురువక పోవడంతో పంట వ్యాధుల బారిన పడుతుందని పలువురు రైతులు వాపోతున్నారు. 

పోషకాహార లోపం తలెత్తుతున్నది: ఏఓ రవితేజ

సరైన వర్షాలు కురవకపోవడంతో పంటల ఎదుగుదల నిలిచిపోయిందని మండల ఏఓ రవితేజ పేర్కొన్నారు. పోషకాహార లోపం వల్ల పోయాబీన్ పంట పైన మచ్చలు వస్తున్నాయని పేర్కొన్నారు. నివారణకు 19. 19. 19. మందును పిచికారి చేయాలని సూచించారు. అంతేగాక వర్షాలు కురిసేంతవరకు పంట రక్షణ కోసం చెరువులను పిచికారి చేయాలని కోరారు.