ఖమ్మం సీఐలు గా బాధ్యతలు చేపట్టిన కరుణాకర్, సాధీక్
06-10-2026 | 03:41pm
సీపీని కలిసిన ఎస్ హెచ్ ఓ లు
ఖమ్మం, అక్టోబర్ 6(విజయక్రాంతి): ఖమ్మం వన్ టౌన్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ల(Raghunathapalem Police Station) ఎస్ హెచ్ ఓ లుగా సీఐలు నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం వన్ టౌన్, రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లకు (ఎస్ హెచ్ ఓ)స్టేషన్ హౌస్ ఎండి. సాధీక్ పాషా, టి.కరుణాకర్ ఇటీవలే బదిలీకాగా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్(Police Commissioner Sunil Dutt) గని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.