ఇరాన్‌కు న్యూజిలాండ్ షాక్
17-06-2026 12:15 AM
డ్రాగా ముగిసిన మ్యాచ్
లాస్‌ఏంజెలెస్, జూన్ 16: సాకర్ ప్రపంచకప్‌లో ఊహించని ఫలితాలు నమోదవుతు న్నాయి. తాజాగా ఇరాన్‌కు 85వ ర్యాంకర్ న్యూజిలాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. ఓట మి ఖాయమనుకున్న మ్యాచ్‌ను డ్రాగా ము గించింది. ఏడో నిమిషంలో ఎలిజా జస్ట్ గోల్ కొట్టగా న్యూజిలాండ్ ఆధిక్యంలో నిలిచింది.
తర్వాత దూకుడు పెంచిన ఇరాన్ 32వ నిమిషంలో రామిన్ చేసిన గోల్‌తో స్కోరు సమ మైంది. కాసేపటికే ఎలిజా మరో గోల్ చేయడంతో కివీస్ 2 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక్కడ నుంచి మరోసారి ఇరాన్ వరుసగా ఎటాక్స్ చేసి ఒత్తిడి పెంచింది. 64వ నిమిషంలో మొహేబీ గోల్ చేయడంతో స్కోరు సమమైం ది. తర్వాత గోల్స్ చేయలేకపోవడంతో మ్యాచ్ 2 డ్రాగా ముగిసింది.






