17 June, 2026 | 1:23 AM

బెల్జియం, ఈజిప్ట్ మ్యాచ్ డ్రా

17-06-2026 12:17 AM

సియాటెల్, జూన్ 16 : సాకర్ ప్రపంచకప్ గ్రూప్- జిలో బెల్జియం, ఈజిప్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ 19వ నిమిషంలోనే  మొహమ్మద్ సలాహ్ పాస్‌ను అందుకున్న ఎమామ్ అషూర్ గోల్ చేసి ఈజిప్ట్‌కు ఆధిక్యం అందించాడు. 65వ నిమిషంలో రొమెలు లుకాకు మైదానంలోకి అడుగుపెట్టిన కేవలం 22 సెకన్లకే ప్రభావం చూపించాడు. థామస్ మునియర్ ఇచ్చిన క్రాస్‌ను అడ్డుకునే క్రమం లో ఈజిప్ట్ ఆటగాడు మహ్మద్ హానీ గోల్ చేయడంతో స్కోరు సమమైంది. చివరి నిమిషాల్లో ఇరు జట్లు విజయం కోసం ప్రయత్నిం చినా ఫలితం లేకుండా పోయింది.