7 April, 2026 | 7:37 AM

బియాంత్ దోషికి నీరాజనం

02-09-2024 12:17 AM

కెనడాలో సిక్కు అతివాదుల కవ్వింపులు

వాంకోవర్, సెప్టెంబర్ 1: కెనడాలో ఖలిస్థానా సిక్కు అతివాదు లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒకవిధంగా భారత్‌పై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా మానవ బాంబుగా మారి పంజాబ్ మాజీ సీఎం బియాంత్‌సింగ్‌ను హత్యచేసిన ఉగ్రవాది దిలావర్ సింగ్ బబ్బర్‌ను కీర్తిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. అది కూడా భారత కాన్సులేట్ ముందే కావటం గమనార్హం. 1995 ఆగస్టు 31న నాటి పంజాబ్ సీఎం బియాంత్‌సింగ్‌ను సిక్కు అతివాదులు హత్యచేశారు. దిలావర్‌సింగ్ ఆత్మాహుతి దాడిలో చనిపోయారు. ఆ ఘటనకు 29 ఏండ్లు నిండిన సందర్భంగా శనివారం వాంకోవర్‌లో సిక్కు అతివాదులు ప్రదర్శన నిర్వహించారు. ఓ కారుపై బియాంత్, బబ్బర్ ఫొటోలతో భారత కాన్సులేట్ ముందుగా ప్రదర్శన నిర్వహించారు.