రాజీనామా చేయమని ఎవరూ చెప్పలేదు: కొండా సురేఖ
02-09-2026 | 04:34pm
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తనను రాజీనామా చేయాలని ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) తెలిపారు. బీసీ అయిన తనకు ఒక న్యాయం, ఇతర సామాజికవర్గాలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, ఆమెకు వివాహమైందని, స్వతంత్రంగా ఉంటున్నారని తెలిపారు. తన కుమార్తె వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని అధిష్ఠానానికి చెప్పినట్లు వెల్లడించారు.






