2 September, 2026 | 5:51 PM

ఎమ్మెల్యే గారు గుడి వద్దు.. మాకు బడి నిర్మించండి సారు

02-09-2026 | 04:51pm

క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చిన సంచార జాతుల విద్యార్థులు

రాజకీయాలను పక్కన పెట్టండి విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్,(విజయక్రాంతి): ఎమ్మెల్యే గారు మాకు గుడి వద్దు బడిని ఏర్పాటు చేయండి సారు.. అవకాశం కల్పించండి సారు అంటూ సంచార జాతుల విద్యార్థులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు మొరపెట్టుకున్నారు. బుధవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డుకు చెందిన సంచార జాతుల విద్యార్థులు ఎంఈఓ మనోహర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు వినతి పత్రం అందించారు.

మున్సిపల్ పరిధిలోని ఏడో వార్డులో గుడి వద్దు ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మించేందుకు కృషి చేయాలని విద్యార్థులు ఎమ్మెల్యేను కోరారు. ఎందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి మొదటి ప్రాధాన్యత ఇచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో విద్యకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో గుడికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందని వివరించారు. విద్యతోనే సమాజంలో మంచి గౌరవం లభిస్తుందని వివరించారు.

విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే కొత్త పాఠశాల భవనం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. పాఠశాల భవన నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి.కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.